NTV Telugu Site icon

ACB Trap: ఏసీబీ వలలో దొరికిన సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా.. ఆమెతోపాటు..?

2

2

తాజాగా ఏసీబీ పన్నిన పన్నాగంలో లంచగొండి సబ్ రిజిస్టర్ పడ్డారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో లంచం డిమాండ్ చేయగా సదర వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో ఈ దాడులను నిర్వహించింది ఏసీబీ. శుక్రవారం సాయంత్రం ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. ఈ రైడులో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ తోపాటు ఆ ఆఫీసులో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశం కూడా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Moscow Attack : మాస్కో ఉగ్రదాడిపై 15రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చిన అమెరికా

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ ఈ మధ్యకాలంలో దంతాలపల్లి గ్రామంలో 128 గజాల ప్లాట్ ను కొనుగోలు చేయగా ఆ స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు. దాంతో మహబూబాబాద్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళగా.. అక్కడ సబ్ రిజిస్టర్ లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేసే డేటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశం ద్వారా లంచంను డిమాండ్ చేయించింది. అయితే హరీష్ దగ్గర అన్ని డాక్యుమెంట్ సక్రమంగా ఉండడంతో.. లంచం ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో తాను వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఇందులో భాగంగానే ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తన పథక ప్రకారం శుక్రవారం సాయంత్రం రిజిస్టర్ ఆఫీసులో తనిఖీలు చేశారు. అదే సమయంలో అధికారులకు లంచం ఇవ్వడానికి హరీష్ ఆఫీస్ కి వచ్చాడు. ఆ సమయంలో డేటా ఏంటి ఆపరేటర్ వెంకటేష్ కు పంతొమ్మిది వేల రూపాయలు ఇస్తుండగా అధికారులు సడన్ గా ఎంటర్ ఇచ్చి సబ్ రిజిస్టర్ తో పాటు వెంకటేష్ ను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. దాంతో సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ తో పాటు వెంకటేష్ పై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్​ బాలిక పై రేప్​ అటెంప్ట్​..!

ఈ ఆఫీసులో కేవలం హరీష్ ఇచ్చిన 19 వేల రూపాయలు మాత్రమే కాకుండా మరో1,72,000 రూపాయలు పోలీసుల తనిఖీలలో వెంకటేష్ టేబుల్ వద్ద డబ్బులు పట్టుబడ్డాయి. అయితే ఈ డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఏవి చూపించక పోవడంతో అవి మొత్తం లంచాల డబ్బులు అని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడంతో ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది కూడా పెద్ద షాక్ కురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆ డబ్బులను మొత్తం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.