Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచింది వైద్య సిబ్బంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తున్న స్వీపర్ గమనించి సూపర్‌వైజర్ రాజుకు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే ఔట్‌పోస్ట్ పోలీసులకు తెలియజేయగా, టౌన్ ఎస్సై వచ్చి ఆ వ్యక్తిని మార్చురీ నుంచి బయటకు తీసి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తి జయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు అని గుర్తించారు. మూడు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వచ్చిన ఆయనకు అటెండర్ లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడంతో అడ్మిట్ చేసుకోలేదు.
READ MORE: Yuvraj Singh: ఐపీఎల్‌లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!
ఈ ఘటనపై అడ్మిట్ రికార్డు, డేత్ రికార్డు ఇవ్వడానికి వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, RMO జగదీష్ పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: రష్మిక మందన్న గ్లామర్ గురూ…ఎలిగెన్స్‌కి కొత్త డెఫినిషన్ !
