Site icon NTV Telugu

Mahbubabad Court: సంచలన తీర్పు ఇచ్చిన మహబూబాబాద్‌ జిల్లా కోర్టు

Mahaboobabad

Mahaboobabad

మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సెన్సేషనల్ తీర్పును ఇచ్చింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌కు మరణశిక్ష వేసింది. కాగా 2020 అక్టోబర్‌18న మహబూబాబాద్‌కు చెందిన కుసుమ వసంత, రంజిత్‌ రెడ్డి దంపతుల కొడుకు దీక్షిత్‌ రెడ్డిని మందసాగర్‌ డబ్బుల కోసం కిడ్నాప్‌ చేసి.. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపైకి తీసుకెళ్లి.. బాలుడిని హతమార్చి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టి చంపేశాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి 45 లక్షల రూపాయలు ఇస్తే బాలుడిని వదిలేస్తా లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.

Read Also: Bigg Boss 7 Telugu: హౌస్‌లోకి కొత్తవాళ్లు.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడంటే?

ఇక, పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులను మందసాగర్ డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగింది.. ఇక, శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మందసాగర్ ను పోలీసులు నిందితుడిగా తేల్చారు. ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతో కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read Also: Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు..

డబ్బులు తీసుకున్నాక దొరికిపోతానన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు మందసాగర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో ఈ కేసులో అరెస్టైన మందసాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించారు.

Exit mobile version