NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్‌

Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025 Masani Gorakh: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో, ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళ ఈసారి ఓ ప్రత్యేక వ్యక్తి ద్వారా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన అభయ్ సింగ్. ఈయన దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి అనుకోని మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయనకు జీవితంలో ఏదో వెలితి అనిపించింది. దీంతో తన కెరీర్‌ను వదిలేసి, సన్యాస జీవితాన్ని ఎంచుకున్నారు.

Also Read: Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!

సన్యాస జీవితాన్ని గడుపుతున్న సమయంలో అభయ్ సింగ్ పేరు ‘మసాని గోరఖ్’ గా మార్చుకున్నారు. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రంపై దృష్టి పెట్టి పోస్ట్ మోడర్నిజం, సాక్రటీస్, ప్లేటో వంటి సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. జీవితం, ఆధ్యాత్మికతపై గాఢమైన జిజ్ఞాసతో, చివరికి శివుడికి అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈయన జీవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోగ్రాఫర్‌గా, ఫిజిక్స్ కోచర్‌గా, డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన చివరికి సన్యాసాన్ని స్వీకరించారు. “ఇదే నిజమైన జీవితం” అంటూ అభయ్ స్పష్టంగా తెలిపారు. ఇప్పుడు ఆయన తన జీవనమార్గాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ‘ఐఐటీయన్ బాబా కథ’ గా వైరల్‌ అవుతుంది. ఇది గమనించిన సోషల్ మీడియా నెటిజన్స్ భౌతిక విజయం కంటే జ్ఞానాన్ని ఎంచుకున్న ఆయనను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

Also Read: Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!

ఇకపోతే ఈ సంవత్సరం కుంభమేళాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహా కుంభమేళాలో, 144 ఏళ్ల తర్వాత ఖగోళ గ్రహాల ప్రత్యేక కలయిక సంభవిస్తోందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. మహా కుంభమేళా మాత్రమే కాకుండా, ఐఐటీయన్ బాబా కథతో పాటు మరిన్ని విషయాలు ఈ వేడుకకు మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

Show comments