Earth Quake : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫెర్న్‌డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది. భూకంపం ధాటికి హంబోల్డ్‌ట్ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందిన అధికారులు తెలిపారు.
Read Also: Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో ‘కింగ్’ ఒక్కరే
దీంతో 12 వేల మందికిపైగా అంధకారంలో చిక్కుకుపోయారని చెప్పారు. వాణిజ్య సముదాయాలు, ఇండ్లకు విద్యుత్ నిలిచిపోయిందన్నారు. భూకంపం వల్ల ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, కొన్ని బిల్లడింగులు, రహదారులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఫెర్న్డేల్లో దాదాపు 15,000 మంది జనాభా నివసిన్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన 261 మైళ్లు (420 కిమీ) , కాలిఫోర్నియాలోని యురేకాకు దక్షిణంగా 19.6 మైళ్లు (31.54 కిమీ) ఉంది. భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం లేదని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది.