Wedding Season: ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం అవుతుండడంతో పెళ్లిళ్ల సీజన్ షురూ కానుంది. మాఘమాసం వచ్చేస్తోంది. ఈ నెల 11వ తేదీన మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసం అంటే పెళ్లిళ్ల సీజన్ అని అందరికీ తెలిసిందే. ఈ నెల 11 నుంచి పెళ్లి సందడి షురూ కానుంది. మాఘమాసం ప్రారంభమైన నాటి నుంచి మార్చి, ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు మూడు నెలల పాటు శుభముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 26 వరకు మాఘం, ఫాల్గుణం, చైత్రం ఈ మూడు మాసాలు (ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో) దాదాపు 30 ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు.
Read Also: Free WiFi: మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 15 నుంచి 25 వరకు..
ఫిబ్రవరి 11న తొలి ముహూర్తం మొదలు ఏప్రిల్ 26 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. 3 నెలల్లో 30 ముహూర్తాలు ఉన్నాయి. సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి. తర్వాత మూఢం, శూన్య మాసం వస్తుంది. మళ్లీ శ్రావణ మాసం (ఆగస్టు) వరకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసం అంటే అప్పటికి వానాకాలం వచ్చేస్తుంది. కాబట్టి పెళ్లిళ్లు, శుభకార్యాలకు అంత అనువుగా ఉండదు. దీంతో పెళ్లి వయసు పిల్లలున్న ఇళ్లలో రాబోయే మూడు నెలల్లోనే సంబంధాలు చూసి ముడిపెట్టేయాలన్న హడావుడి మొదలైంది.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో ఇప్పటి నుంచే డబ్బున్నోళ్లు… తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది.కేవలం ఫంక్షన్ హాల్స్ మాత్రమే కాదు.. పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. , అన్నవరం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. దీంతో ఆయా ఆలయాలకు కూడా ముందుస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మంగళవాయిద్యాలు మోగనున్నాయి.