మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు.
READ MORE: Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..
అసలు ఈ అంశం ఏంటి?
డీఎంకే ప్రభుత్వం నిరుపేద గృహిణులకు ప్రతినెలా రూ.1,000 నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేసే ‘కలైంజర్ మహిళా సాధికారిక పథకం’ గురించి ఓ సభలో వివరించారు. ఒక సెక్స్ వర్కర్ గురించి మాట్లాడే క్రమంలో హిందూ మత చిహ్నాలను లైంగిక భంగిమలతో పోలుస్తూ ఆయన చేసిన వివాదాస్పద జోక్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన్ను డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి స్థానం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు కారణాలను అందులో చెప్పలేదు. తాజాగా కోర్టు సైతం ఈ అంశంపై తీవ్రంగా మండిపడింది.
READ MORE: Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..
