NTV Telugu Site icon

Madras High Court: అన్నాడీఎంకేకు భారీ షాక్.. ఎంపీ ఎన్నిక రద్దు చేసిన మద్రాసు హైకోర్టు

Mp Ravindra

Mp Ravindra

తమిళనాడు రాజకీయల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు మద్రాసు హైకోర్ట్ షాక్‌ ఇచ్చింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు క్యాన్సిల్ చేసింది. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలినట్లైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్‌ ఎన్నికను క్యాన్సిల్ చేస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Also Read: Telangana : కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ఇద్దరు మహిళలు మృతి..

అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్‌ ఎలంగోవన్‌పై 76 వేల 672 ఓట్ల ఆధిక్యతతో ఓపీ రవీంద్రనాథ్‌ గెలిచారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్‌ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read: CM YS Jagan Kadapa Tour: కడపలో సీఎం జగన్‌ పర్యటన.. మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్‌ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే నుంచి ఓపీ రవీంద్రనాథ్‌ 2022లోనే పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్‌ మాత్రమే గెలిచాడు.. డీఎంకే-కాంగ్రెస్ కూటమి తమిళనాడులోని మొత్తం 39 సీట్లలో 38 స్థానాల్లో గెలిచింది.