Site icon NTV Telugu

Vishal : నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్.. ఆ డబ్బు తిరిగి కట్టాల్సిందే.. లేదంటే జైలుకే

Lyca

Lyca

 ప్రముఖ నటుడు మరియు నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో నడుస్తున్న రుణ వివాదానికి సంబంధించి కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు విధించిన రూ.10 కోట్ల డిపాజిట్‌కు గడువు పొడిగించాలని విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) కొట్టివేసింది.

Also Read : Exclusive : మహేశ్ బాబు – సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్..

 2016లో ‘మరుదు’ (తెలుగులో ‘రాయుడు’) సినిమా నిర్మాణం కోసం విశాల్ గోపురం ఫిలిమ్స్ నుండి రూ.21.29 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పును తర్వాత లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. ఒప్పందం ప్రకారం, విశాల్ ఈ మొత్తాన్ని 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించారని, తమ అనుమతి లేకుండా తన సినిమాల హక్కులను ఇతరులకు విక్రయిస్తున్నారని లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి, వడ్డీతో కలిపి మొత్తం బాకీని చెల్లించాలని గతంలో తీర్పు ఇచ్చారు. దీనిపై విశాల్ అప్పీల్‌కు వెళ్లగా, మధ్యంతర స్టే కోసం కోర్టు రిజిస్ట్రార్ వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ద్విసభ్య ధర్మాసనం షరతు విధించింది. అయితే విశాల్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారని, డబ్బు సమీకరించడానికి మరో ఆరు వారాల గడువు కావాలని విశాల్ తరపు న్యాయవాది కోరారు. అయితే జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ కె. కుమరేష్ బాబులతో కూడిన ధర్మాసనం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇక గడువు పొడిగించలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో విశాల్‌పై ఆర్థికంగా మరియు న్యాయపరంగా మరింత ఒత్తిడి పెరిగింది. కోర్టు ఆదేశాలను పాటించని పక్షంలో లైకా ప్రొడక్షన్స్ తమ బకాయిల వసూలు కోసం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version