NTV Telugu Site icon

Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?

Ban On Child Birth

Ban On Child Birth

Ban on Child Birth: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ అనే గ్రామంలో గత 400 ఏళ్లుగా మహిళలు ఎలాంటి ప్రసవానికి నోచుకోలేదు!. గ్రామంలోని మహిళలు గ్రామ పొలిమేరలను దాటి బయటికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తారు. గ్రామంలో జన్మనిస్తే, బిడ్డ వికృతంగా మారుతుంది లేదా తల్లి లేదా బిడ్డ చనిపోతారని గ్రామస్థులు భయపడుతున్నారు. సంకశ్యామ్‌ ఊరికి శాపం ఉందని.. అందుకే ఆ గ్రామస్థులు ఊరు బయటే ప్రసవిస్తారు. వర్షాకాలంలోనైనా సరే టేకు ఆకుల పందిరి కింద, భారీ వర్షాలకు ఊరి సరిహద్దు బయట ఉన్న మైదానంలో పిల్లలకు జన్మనిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా అక్కడి గ్రామస్థులు పట్టించుకోరు.

మరోవైపు సాధారణంగా మనల్ని ఎవరైనా జన్మ స్థలం లేదా సొంత గ్రామం గురించి అడిగితే ఫలానా ఊరు అని చెప్పుకుంటాం. కొంత మంది మాత్రం పుట్టిన ఊరిలోనే స్థిరపడి ఉంటారు. కానీ రాజ్‌గఢ్ జిల్లా సంకశ్యామ్​ గ్రామ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. వారు తమ ఊరి పేరు చెప్పుకోవడానికే భయపడతారు. ఇక్కడి గ్రామ ప్రజలు ఇప్పటికీ ఓ శాపానికి భయపడూతూ జీవిస్తున్నారు. అదేంటంటే..

16వ శతాబ్దంలో గ్రామంలో దేవతలు ఆలయాన్ని నిర్మించేవారని ఈ గ్రామంలోని పెద్దలు పేర్కొంటున్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ సమీపంలో గోధుమలు రుబ్బుతుండగా.. ఆ శబ్ధం దేవతలకు భంగం కలిగించిందని.. దీంతో దేవుళ్లకు కోపం వచ్చి ఈ గ్రామంలో స్త్రీలకు పిల్లలు పుట్టరని శపించారని గ్రామస్థులు నమ్ముతున్నారు. అందుకే ఏ మహిళ కూడా గ్రామంలో పిల్లలను కనదు. “90 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతాయి, అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు ఊరి బయటే జరుగుతాయి. ఆలయ నిర్మాణానికి ఓ మహిళ ఆటంకం కలిగించిందని, అందుకే ఈ గ్రామానికి శాపం ఏర్పడిందని నమ్ముతారు. ” అని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్ తెలిపారు.

Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

ఈ నమ్మకం చాలా ప్రముఖమైనది. ఏ స్త్రీ కూడా గ్రామ ప్రాంగణంలో ప్రసవానికి ప్రయత్నించదు. వాస్తవానికి, గ్రామస్తులు ఒక ప్రత్యేక గదిని నిర్మించారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఒక మహిళ అక్కడికి వెళ్లి ప్రసవించవచ్చు. భారతదేశంలోని ప్రజలలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. శతాబ్దాలుగా మూఢనమ్మకాలను ప్రజలు ఇంకా నమ్ముతున్నారనడానికి ఉది ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికీ ఆ ఊర్లో ఒక్క ఆస్పత్రి కూడా లేదంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతే కాకుండా బాలింతలకు లేదా పిల్లల తల్లులకు ఇచ్చే ప్రభుత్వ సహాకారాలు సైతం ఈ గ్రామస్థులకు అందదు. కొంత మంది గర్భిణిలు తమకు ఏడోనెల పడగానే వెంటనే ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు.

Show comments