NTV Telugu Site icon

Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!

Road Accident

Road Accident

Road Accident: మధ్యప్రదేశ్‌ లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ, శనివారం అర్థరాత్రి, ప్రయాణికులతో నిండిన బస్సు నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దింతో ఈ విషాద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మైహర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న అభా ట్రావెల్స్‌కు చెందిన హైస్పీడ్‌ లగ్జరీ బస్సు మైహార్‌ జిల్లా నదన్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న రాయితో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ముగ్గురు సత్నా జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Mobile Charging: మీ స్మార్ట్‌ఫోన్ కు నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుందా.? ఇలా చేసి ఛార్జింగ్ వేగాన్ని పెంచండి!

ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో రెస్క్యూ టీం గ్యాస్ కట్టర్‌తో బస్సును కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ టీమ్‌ బస్సులోంచి క్షతగాత్రులను బయటకు తీసి అంబులెన్స్‌ల ద్వారా అమర్‌పతన్‌, మైహర్‌, సత్నా ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Show comments