NTV Telugu Site icon

Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..

Minister Pro

Minister Pro

మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పీఆర్వో పూజా థాపక్ ఆత్మహత్య చేసుకున్నారు. పూజా థాపక్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో క్లాస్-2 ఆఫీసర్ గా ఉండేవారు. గోవింద్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూజా థాపక్ భర్త నిఖిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ (నాయబ్ తహసీల్దార్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. పూజా థాపక్ కు నిఖిల్ తో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఏడాది పాప కూడా ఉంది. పూజా తన భర్త నిఖిల్‌తో గొడవ పడ్డట్లు తెలుస్తోంది.

READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు

గోవింద్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజా థాపక్ తన కుటుంబంతో కలిసి భోపాల్‌లోని సాకేత్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గత మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ పీఆర్‌వో పూజా థాపక్‌కు ఆమె భర్త నిఖిల్‌తో రాత్రి ఏదో సమస్యపై వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో గొడవ తీవ్రస్థాయికి చేరి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అలాగే, ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), భోపాల్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాగా.. మంత్రి ప్రహ్లాద్ పటేల్ శాఖకు సంబంధించిన వార్తలను పూజా థాపక్ మంగళవారం రాత్రి 9 గంటలకు మీడియాకు పంపారు. ఆమె మధ్యప్రదేశ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ప్రస్తుతం మంత్రి ప్రహ్లాద్ పటేల్ వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు.

Show comments