NTV Telugu Site icon

Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..

Delhi Crime News

Delhi Crime News

ఈరోజుల్లో అప్పులకు డబ్బులు ఇస్తే ఇక ప్రాణాలను వదిలేసుకున్నట్లే.. ఇటీవల చాలా ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. మేనల్లుడు కదా అని అప్పు ఇస్తే మేనమామ ను అతి కిరాతకంగా చంపిన ఘటన వెలుగు చూసింది..దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో పాతిపెట్టాడు..ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వాప్తంగా కలకరం రేకెత్తించింది..

వివరాల్లోకి వెళితే.. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మోహిత్ అనే యువకుడు తన మేనమామ అయిన వివేక్ నుంచి కొంత కాలం కిందట రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే వివేక్ కు ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో మోహిత్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తన మేనళ్లుడు తీసుకున్న అప్పును అడిగేందుకు వివేక్ ఈ నెల 12వ తేదీన అతడి ఇంటికి బయలుదేరాడు… అయితే అప్పు విషయంలో ఏదో గొడవ జరిగింది.. తాగే టీలో మోహిత్ నిద్రమాత్రలు కలిపాడు. ఈ విషయం తెలియని వివేక్ టీ తాగాడు. కొంత సమయానికి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో మేనళ్లుడు తన మేనమామను దారుణంగా హతమార్చాడు. శరీర భాగాలను కత్తితో ఆరుభాగాలు చేశాడు. అనంతరం వాటిని పాలిథీన్ సంచిలో వేసుకొని గోపీకృష్ణ సాగర్ డ్యామ్ సమీపంలోని ఓ గుంతలో పాతిపెట్టాడు.. ఏమి ఎరగనట్లు ఇంటికి వచ్చేశాడు..

పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మృతదేహం నుంచి వివేక్ తలను వేరు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేతికి ఉన్న ఉంగరం, తాళాల వల్ల అతని శరీర భాగాలని కుటుంబ సభ్యులు అతన్ని గుర్తించారు.. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. మోహిత్ ఇంటికి వివేక్ తరచూ వచ్చి వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిపేవాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య వెనుక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.. ఈ హత్యకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..