కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై.. మాజీ ఎంపీ మధు యాష్కీ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ కారణమని చురకలు అంటించారు. పార్టీ నిర్ణయం కాదని సమ్మేళనం కి వెళ్ళటం పార్టీని నష్ట పర్చడమేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి సమర్ధిస్తారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని… కానీ పార్టీ లో ఉంటూ వెన్నుపోటు పోడవద్దని చురకలు అంటించారు మధు యాష్కీ. ఇక సీతక్క పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. సంస్కారం లేని వాళ్ళు చేసే మాటలు అని మండి పడ్డారు.
కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్… బయటకు వెళ్లానుకుంటే వెళ్లచ్చు !
