Site icon NTV Telugu

Madhuri Dixit: బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ ఇంట తీవ్ర విషాదం

Snehlatha Dixit

Snehlatha Dixit

Madhuri Dixit Mother Snehlata Dixit Passes Away: ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్‌(90) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తల్లి ప్రాణాలు కోల్పోవడంతో మాధురి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రియమైన ఆయి (తల్లి), స్నేహలత ప్రియమైన వారి మధ్య ఈ ఉదయం ప్రశాంతంగా మరణించారు’ అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. స్నేహలత అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మాధురి దీక్షిత మాతృమూర్తి మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read Also: Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

ఇటీవల మాధురీ దీక్షిత్‌ తల్లి పుట్టిన రోజు సందర్భంగా శ్రీరామ్ నేనే తన అత్తగారి గురించి స్వీట్ పోస్ట్ చేశారు. 90 ఏళ్ల వయస్సులోనూ ఆమె పెయింట్ చేస్తారని చెప్పారు. కాస్తా క్షీణించినట్టు తెలిపారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత మనోహరమైన, అత్యంత సానుకూలమైన వ్యక్తి అంటూ, ఆమె ప్రతిభను ఎల్లప్పుడూ గుర్తిస్తామంటూ పలు ఫొటోలను షేర్ చేసుకున్నాడు.

Exit mobile version