బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి మంచి పేరును అందుకుంది.. ఎక్ దో తీన్ సాంగ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆమె వయసు 56 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే.. ఆమె అందం కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది.. ఇప్పటికి హీరోయిన్ గా అందరు చూస్తారు. అంత అందంగా ఉంటుంది.. ఈ హీరోయిన్ కు కార్ల కలెక్షన్ అంటే చాలా ఇష్టం.. తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది..
ఈమెకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్ సినిమాలు, రియాల్టీ షోలతో బిజీగా ఉన్న మాధురీ దీక్షిత్ ఇప్పుడు మరో ఖరీదైన కారును సొంతం చేసుకుంది.. దీని రేటు విని అందరు షాక్ అవుతున్నారు.. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB 3.0ని కొనుగోలు చేసింది. ఇది చాలా ఖరీదైన కారు.. దీని ధర అక్షరాల రూ.4 కోట్లు.. రీసెంట్ గా తన భర్తతో కలిసి కారులు ముంబైలో చక్కర్లు కొట్టింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ కారుకు కలర్ ప్రత్యేకంగా ఉండాలని అంత డబ్బులను వెచ్చించిందని తెలుస్తుంది.. మాధురీ దీక్షిత్ ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ S560 కారులో కనిపిస్తారు. దీని ధర 2 కోట్ల రూపాయలు.. పోర్షే, 911, ఫెరారీ 296 GTB తో పాటుగా ఈమె గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి…
