MadhuBala : రోజా సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మధుబాల. సినీ ఇండస్ట్రీలో మధు అంటే పెద్దగా తెలియాదు. మధుబాల అంటు ఠక్కున గుర్తుకు వస్తుంది. మధునే ఆమె అసలుపేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన మధుబాలగా స్ర్కీన్ నేమ్ పెట్టుకుంది. ఒట్టాయల్ పట్టాలమ్ అనే మలయాళ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ ఆమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మధుబాల ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించారు.
Read Also: RCB vs KKR: కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిన ఆర్సీబీ
తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శాకుంతలం సినిమాలో సమంత మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంపై తొలిసారిగా మధు స్పందించింది. శాకుంతలం సినిమ ఫెయిల్యూర్ కావడం బాధించిందన్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సీజీఐ కోసమే ఏడాది పాటు కష్టపడ్డారని తెలిపారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఎలాంటి ఒత్తిడి లేదు. టాలీవుడ్‌లో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వారి విజయానికి సరైన కారణం లేదు. అవి ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత నిరాశకు గురి చేస్తుందని అనుకోలేదు.’ అన్నారు. ఇదిలా ఉంటే అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తీశారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also:Bhatti Vikramarka : మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మనకు కావాలి
