Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో ఫారెన్‌ అమ్మాయిలతో వ్యభిచారం.. ఈ వెబ్‌సైట్ల ద్వారా ట్రాప్ చేసి..

Prostitution Racket

Prostitution Racket

Madhapur Police Bust High-End Prostitution Racket: మాధాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం గృహంపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు దాడి చేశారు. గాయత్రి నగర్, పర్వత్ నగర్‌లోని బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ లివింగ్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పించి వ్యభిచారంలోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు. Locanto, Skokka వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తూ, వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఓయో రూమ్స్, ఇతర హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

READ MORE: Oka Parvathi Iddaru Devadasulu: సరికొత్త ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’?

బీఎస్‌ఆర్‌ సూపర్ లగ్జరీ కో లివింగ్ హోటల్‌పై దాడి చేసి ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 7 మంది మహిళలు, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్కు చెందిన మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలను స్టేట్ హోమ్ కు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న హామర్ సింగ్ (ఆర్గనైజర్), తమ్మి శ్రీనివాస్ (సూపర్వైజర్), పొకల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెక్‌మెటోవా గుల్షాట్, రఖ్మానోవా మలికా @ లోవినా బోరా, లక్ష్మణ్ తుము, ఆకాష్ బజాజ్, గోరా మహ్మద్ వసీమ్, కె.పార్థిబన్ పరారీలో ఉన్నారని తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు, 9 మంది ముఠాను అరెస్ట్ చేసి మాధాపూర్ పోలీసులకు అప్పగించారు…

READ MORE: Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!

Exit mobile version