Site icon NTV Telugu

Madarasi: సెప్టెంబర్ 5న ‘మదరాసి’ వరల్డ్ వైడ్ రిలీజ్

Siva Karthikeya

Siva Karthikeya

తమిళ సినిమా పరిశ్రమలో శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. వీరిద్దరి తాజా సినిమా మదరాసి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మదరాసి సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్‌లో శివకార్తికేయన్ ఇంటెన్స్ లుక్‌తో కనిపించారు, అతని కళ్లలో కనిపించే తీవ్రత సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఎఆర్ మురుగదాస్ సినిమాలకు సంబంధించిన గ్రిప్పింగ్ కథనం, శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలోనూ పుష్కలంగా ఉంటాయని ఈ పోస్టర్ సూచిస్తోంది. మదరాసి ఒక సాధారణ యాక్షన్ సినిమా కాకుండా, ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథనం అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Odela2 : ఓదెల-3 ఉంటుందా.. సంపత్ నంది క్లారిటీ..

ఎఆర్ మురుగదాస్ గతంలో తుపాకి, కత్తి, గజిని వంటి బ్లాక్‌బస్టర్‌లతో తనదైన ముద్ర వేశారు. మదరాసితో ఆయన మరోసారి తన ఇంటెన్సీవ్ స్టోరీ టెల్లింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రం ఒక సరికొత్త యాక్షన్ డ్రామాగా, శివకార్తికేయన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శివకార్తికేయన్‌ను ఒక రగ్గడ్, శక్తివంతమైన పాత్రలో చూపించేందుకు మురుగదాస్ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. మదరాసి చిత్రంలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె తన సహజ నటనతో ఈ పాత్రకు ప్రాణం పోస్తారని భావిస్తున్నారు. అలాగే, విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా విద్యుత్ జామ్వాల్ ఈ చిత్రంలో విలన్‌గా మరోసారి మురుగదాస్‌తో జతకట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్టార్-స్టడెడ్ కాస్ట్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

Exit mobile version