Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Lady Don Koneti Sulochana House Raided: మదనపల్లెలో ‘లేడీ డాన్’గా పేరొందిన కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించారు. కోర్టు సెర్చ్ వారెంట్‌తో మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లోనూ తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో 50 రకాల ఆస్తి పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న 15 ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఇచ్చినట్లు నమ్మించి అమాయకుల నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని.. వాటి ఆధారంగా ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సులోచన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి పరిశీలించనున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో కలిసి వందల కోట్ల విలువైన భూముల వ్యవహారంలో సులోచన కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన స్థలం, భవనం.. పొన్నూటిపాళ్యంలో 1.75 ఎకరాల భూమి ఆమె పేరుతో ఉన్నట్లు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోర్జరీ పవర్ ఆఫ్ అటార్నీతో రూ.10 కోట్ల విలువైన 47 సెంట్ల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అయితే సోదాలు జరుగుతున్న సమయంలో కోనేటి సులోచన ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు మార్పు వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సులోచనపై 14 క్రిమినల్ కేసులు, రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భూముల వ్యవహారానికి సంబంధించిన పత్రాలు.. ఫోర్జరీ సంతకాలపై ఫోరెన్సిక్ నివేదిక.. ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?