NTV Telugu Site icon

Tahsildar Sensational Comments: వైరల్‌గా మారిన మడకశిర తహసీల్దార్‌ వీడియో..

Madakasira

Madakasira

Tahsildar Sensational Comments: మంత్రులు, ఉన్నతాధికారులో తమ ప్రాంతంలో పర్యటిస్తే.. కిందిస్థాయిలో అధికారులు ఆ ఖర్చులు భరించడం.. వాటిని లెక్కల్లో చూపించడం చేస్తుంటారు.. అయితే, అసలు డబ్బులే లేకపోతే ఏం చేయాలి? అనేది పెద్ద ప్రశ్న.. కొన్ని సందర్భాల్లో కిందిస్థాయిలో అధికారులు ఎలా నలిగిపోతున్నారట.. ఓ ఎమ్మార్వో చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పైసా లేనిదే పనిచేయను అంటూ తెగేసి చెబుతోన్న ఆ తహశీల్దార్.. బహిరంగంగానే లంచం డిమాండ్‌ చేయడం కొసమెరుపు.. అసలు ఇంత ఖర్చులు తాము ఎలా భరించాలని నిలదీస్తున్నాడు.. అయితే, మంత్రుల పర్యటన ముసుగులో లక్షలు వసూళ్లు చేస్తున్నారని మండిపడుతున్నారు.. మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో కంచాల నిండా లంచాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నరాయి..

Read Also: Rakul Preet Singh: శారీ లో నడుము అందాలతో అట్ట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

ఇక, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్‌.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.. మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు.. అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తుంటాం అని చెప్పుకొచ్చాడు.. ఈ నెల 13వ తేదీన టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం అయినా ఖర్చు లక్షా 70 వేల రూపాయలు అయ్యిందన్నారు.. అంతేకాదు, ఆయనకు వాళ్లు పెట్టిన మెనూ కూడా చూపిస్తూ.. మడకశిరలో దొరకకపోతే మరో ప్రాంతం నుంచి తెప్పించాల్సి వచ్చిందంటూ రుబాబు చూపించారు. ఆ ఖర్చుకు నా జీతం డబ్బులు ఇవ్వాలా? అని ప్రశ్నించాడు.. రైతులతో డబ్బులు తీసుకొని పని చేసి పెడుతుంటాం.. పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు వాటికి ఖర్చు పెడతాం.. అంతేకానీ, నేను, కింద వీఆర్వోలు ఖర్చు చేయాలంటే ఎలా అవుతుంది అంటూ ఆ రైతుకు సమాధానం చెప్పాడు.. ఎవడికి మా బాధ అర్థం కాదు.. మేం చెప్తేనే బయటకు తెలుస్తుంది.. ఏమన్నా అంటే లంచం తీసుకుంటున్నారు అంటారంటూ.. తాను చేసే పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కి చక్కర్లు కొడుతుండడంతో.. అతడిని పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.