Site icon NTV Telugu

Paris Olympics: రష్యా కుట్ర చేస్తోదంటూ ఫ్రాన్స్‌ తీవ్ర ఆరోపణలు

Ele

Ele

రష్యాపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జులైలో జరగనున్న ఒలింపిక్స్ వేడుకలకు పారిస్‌ సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. ఇది తప్పుడు సమాచార వ్యాప్తితో పాటు మరే విధంగానైనా ఉండవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం..

ఒలింపిక్స్‌ వేడుకలు జరగనున్న ప్రాంతాన్ని అధ్యక్షుడు మెక్రాన్‌ సందర్శించారు. అక్కడ ఓ నూతన క్రీడా విభాగాన్ని ప్రారంభించిన ఆయన పారిస్‌ క్రీడలపై విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచివుందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే రష్యాపై మెక్రాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇది కూడా చదవండి: West bengal: గవర్నర్-ప్రభుత్వం మధ్య ఘర్షణ.. కారణమిదే!

ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్‌ అభిప్రాయపడుతున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్‌కు లేనప్పటికీ.. ఏదో ఒకరోజు యూరోపియన్‌ దళాలు ఉక్రెయిన్‌కు వెళ్లడాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఐరోపాలో అసత్య ప్రచారాలకు రష్యా పాల్పడుతోందని ఆరోపిస్తున్న ఫ్రాన్స్‌.. వీటిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెబుతోంది.

ఇది కూడా చదవండి: West bengal: గవర్నర్-ప్రభుత్వం మధ్య ఘర్షణ.. కారణమిదే!

Exit mobile version