సువాసనలు వెదజల్లే మాచి పత్రి పూలలో వేసి దండలు కడతారు.. పూల వాసనతో ఈ వాసన కలిసి చాలా బాగుంటుంది.. రైతులు పూవ్వుల తోటలు పెంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. రైతులు ఈ పువ్వుల తోట ద్వారా వ్యాపారులతో కాంట్రాక్టు పద్దతిలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పూవులని పండిస్తున్నారు.. ఇక పూలతో పాటు మాసుపత్రిని కూడా పండిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఎక్కువగా ఈ పంటలను పండిస్తున్నారు..
మసుపత్రిని ఎక్కువగా పువ్వుల దండలలో, ఇంటిలో అలంకారానికి, పెళ్లిళ్లలో అలంకారానికి వాడుతారు. ఈ రైతు 30 సంవత్సరాల నుంచి మసుపత్రిని సాగు చేస్తున్నారు. పువ్వుల దండలో వాడే దవనం కూడా సాగు చేసే వాళ్ళు. మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ఇప్పుడు సాగు చేయడం లేదు.. ఇక విషయానికొస్తే.. మాసుపత్రి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. వీటిని తినడం ద్వారా జలుబు, దగ్గు లాంటి రోగాలు తగ్గుతాయి. దాని వల్ల కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మసుపత్రిని కోతలు కోసిన నెల రోజులకి మళ్ళీ కోతకి సిద్ధంగా ఉంటుంది..
ఈ పంటలో కలుపు రాకుండా ఉంటే మంచి దిగుబడిని పొందవచ్చు..ఒకసారి ఈ పంటని వేస్తే 10 సంవత్సరాలు వస్తుంది. మూడు నుంచి నాలుగు రోజులకి ఒకసారి నీళ్లు ఇస్తే చాలు. పంట దిగుబడి మంచిగా రావడానికి ఎరువులు వేయాలి.. నీటిని కూడా పెడుతూ ఉండాలి.. అప్పుడే ఆకులు బాగా ఉంటాయి.. మొత్తం పెట్టుబడి ఖర్చులు పోను రోజుకి 5000 రూపాయలు ఆదాయం వస్తుంది. మసుపత్రిలో అంతర పంటగా సన్నజాజులు పండిస్తున్నారు. ఈ మసుపత్రి వల్ల సన్నజాజుల మొక్కలకి మంచి బలం వస్తుంది.. పూల దిగుబడి కూడా పెరుగుతుంది.. ఈ పంటకు ఎర్ర రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి.. ఈ పంట గురించి సమాచారం కోసం వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..