Site icon NTV Telugu

MacBook Air M4: కొనుగోలుకు ఇదే సరైన సమయం.. డెడ్ చీప్‌గా యాపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌!

Macbook Air M4 Price

Macbook Air M4 Price

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లు కేవలం ఐఫోన్‌లపై మాత్రమే కాకుండా ఇతర యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్‌లను అందిస్తున్నాయి. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లైనప్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. ప్రీమియం విభాగంలోని చాలా విండోస్ ల్యాప్‌టాప్‌ల కంటే ధరలు తక్కువగా ఉన్నాయి. మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి సరైన సమయం అని చెప్పొచ్చు.

లేటెస్ట్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం4 ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మరింత తక్కువకు అందుబాటులో ఉంది. మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం4 2025 ప్రారంభంలో లాంచ్ అయింది. ఇది యాపిల్ తాజా M4 జనరేషన్ చిప్‌లను కలిగి ఉంది. రాబోయే కొన్ని నెలల్లో M5 చిప్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే M4 చిప్‌తో కూడిన వెర్షన్‌లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం4పై మంచి డీల్స్ ఉన్నాయి.

Also Read: Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ వర్సెస్ అమెజాన్.. ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ఎందులోనో తెలుసా?

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం4 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ కలిగిన వేరియంట్ ధర రూ.99,900కి లాంచ్ అయింది. అయితే కొన్ని నెలల్లోనే దాని ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో రూ.82,990కి అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్ రూ.4,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. దాంతో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం4 రూ.78,990కి మీ సొంతం అవుతుంది. ఇది విద్యార్థులు, సాధారణ వినియోగదారులకే చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రయాణాల్లో కూడా సులువుగా దీనిని క్యారీ చేయొచ్చు.

Exit mobile version