Maadhavi Latha: మజ్లీస్ కి కంచుకోటైన.. హైదరాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దశాబ్ధాలుగా అక్కడ అసదుద్ధీన్ ఒవైసీ పాగా వేసుకున్నారు. ఈసారి అతడిని ఖచ్చితంగా ఓడిస్తానికి ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత కంకణం కట్టుకున్నారు. కాని కొన్ని విషయాల్లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట ఆమెకు సీటు కేటాయించడంపై సొంత పార్టీ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే.. “ఒవైసీపై పోటీ చేసేందుకు మగాళ్లేవరూ దొరకలేదా” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. ప్రజలు పరుగులు
నగరంలోని ఆమెకు చెందిన ఓ ఆస్పత్రిపై చాలా ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇటీవల శ్రీ రామ నవమి ర్యాలీలో ఆమె ప్రవర్తించిన తీరుపై ఏఐఎంఐఎం నాయకులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ ఏఎస్సై (ASI) ఉమాదేవి మాధవీలతను కౌగిలించుకున్న ఘటనలో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఉమాదేవిని సస్పెండ్ చేశారు. ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటన బీజేపీపై ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.