మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలు., ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దింతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది.
Also read: Off The Record: కడియం శ్రీహరి వర్సెస్ ఆరూరి రమేష్.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపెవరిది ?
26 మంది కమిటీ సభ్యుల ఈ నిర్ణయంలో భాగంగా.. రఘు బాబు జెనరల్ సెక్రెటరీ, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీ, శివ బాలాజీ ట్రెజర్, ఈసీ మెంబెర్స్ గా మధుమిత, శైలజ, జై వాణిలు కొనసాగనున్నారు. ఇక ఈ నేపథ్యంలో విష్ణు పనితీరును లైఫ్ మెంబెర్స్ మెచ్చుకున్నారు. కాబట్టి 5 ఏళ్ల వరకు ‘మా’ అధ్యక్షుడిగా కొనసాగడం చరిత్రలో మొదటిసారి. కాబట్టి మరో 5 ఏళ్ల వరకు ‘మా’ ఎన్నికలు లేనట్లే. ఇకపోతే ప్రస్తుతం మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనేకమంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. 2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనారు.