Site icon NTV Telugu

Luxury Cruise Ship: 200 మంది ప్రయాణికులతో మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన లగ్జరీ నౌక

Ship

Ship

Luxury Cruise Ship Of Green land Stranded In Remote Part: గ్రీన్‌లాండ్‌ మారుమూల ప్రాంతంలో ఓ విలాసవంతమైన నౌక చిక్కుకుంది. ఆ లగ్జరీ నౌకలో 200 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నాయి. మూడు వారాల ట్రిప్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన బయలుదేరింది ఈ నౌక. పర్యటన అనంతరం ఈ నెల 22వ తేదీన ఈ నౌక తిరిగి పోర్టుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గ్రీన్‌లాండ్‌ మారుమూల ప్రాంతంలో ఆ నౌక చిక్కుకుపోయింది. అక్కడి నుంచి అది ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. గ్రీన్‌ల్యాండ్ రాజధాని నుక్‌కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి 33 వేల డాలర్లు తీసుకున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ.27 లక్షల రూపాయలు.

Also Read: Jammu Kashmir Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం..
అయితే షిప్ లో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం లేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్టు షిప్ ఆపరేటర్ అరోరా ఎక్స్‌పెడిషన్స్ తెలిపారు. అవసరమైన అన్ని సౌకర్యాలు షిప్ లో ఉన్నాయని వెల్లడించారు. అయితే, రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని అప్పటి వరకు వేచి ఉండాల్సిందే అని పేర్కొ్న్నారు. ఇక షిప్ లో ఉన్న ప్రయాణీకులలో కొందరు ఆందోళన చెందుతుంటే మరికొందరు ఆ ప్రాంతం చాలా అందంగా ఉండంటూ ఆస్వాదిస్తున్నారు. ఇక షిప్ లో ముసలివాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. షిప్ లో ఉన్న వారిలో ముగ్గురుకు కరోనా సోకింది. ఈ విషయం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే షిప్ లో ఓ డాక్టర్ కూడా ఉన్నారని క్రూయిజ్ నౌక ఆపరేటర్ పేర్కొన్నారు.


 

 

 

 

 

Exit mobile version