Site icon NTV Telugu

Luthra Brothers Arrest: ఇండియాకు లూథ్రా బదర్స్.. ఎయిర్ పోర్ట్‌లోనే అరెస్ట్

Luthra Brothers Arrest

Luthra Brothers Arrest

Luthra Brothers Arrest: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం తర్వాత క్లబ్ యజమానులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు ఇండియా నుంచి ఫుకెట్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వారి పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వారిపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. దీంతో థాయ్ అధికారుల లూథ్రా బదర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు లూథ్రా బదర్స్‌ను అధికారులు ఇండియా తీసుకువచ్చారు.

READ ALSO: Akhanda 2: అఖండ2’లో వైసీపీ ఫ్యాన్.. బోయపాటి శ్రీను క్లారిటీ

రెండు దేశాల మధ్య 2015 నుంచి అమలులో ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లోనే నిందితులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత వారిని కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. డిసెంబర్ 6న అర్పోరాలోని లూథ్రా బ్రదర్స్ బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు సహా 25 మంది మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నైట్ క్లబ్ యజమానులైన లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున 1:17 గంటలకు థాయిలాండ్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని గోవా పోలీసులు వెల్లడించారు.

డిసెంబర్ 6న క్లబ్ యజమానులైన గౌరవ్, సౌరభ్ లూథ్రాలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, ఎటువంటి అగ్నిమాపక భద్రతా పరికరాలు, ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండా అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ రెస్టారెంట్‌లో ఫైర్ షో నిర్వహించారని అధికారులు తెలిపారు. ఈ ఫైర్‌ షోలో జరిగిన అగ్నిప్రమాదంలో 5 పర్యాటకులు, సహా 25 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

READ ALSO: Boyapati Srinu : అఖండ2 లాజిక్‌లెస్ ట్రోల్స్.. బోయపాటి షాకింగ్ కామెంట్స్

Exit mobile version