NTV Telugu Site icon

Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున పొరపాటున ఈ పనులు చేశారో.. ఇక అంతే

Chandra Grahan 2023

Chandra Grahan 2023

Lunar Eclipse: ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. విదేశాల్లో నివసించే భారతీయులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వైశాఖ మాసం పూర్ణిమ ను బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. రేపు సాయంత్రం స్వాతి నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం శుక్రవారం రాత్రి 8.44 గంటల నుంచి అర్థరాత్రి 01.02 వరకు ఉండనుంది. గ్రహణాన్ని చూడటం మంచిదికాదని అశుభమని చెప్పారు. గ్రహణ సమయంలో ఏం చేయకూడదో తెలుసుకుందాం..

Read Also:Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. సైన్యాన్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం

గ్రహణ సమయంలో చేయకూడని పనులు..
– గ్రహణం ప్రారంభమైన తర్వాత ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అలా చేస్తే ఎటువంటి ఫలితాలు లభించవు. పైగా ఇంటికి అరిష్టం.
– గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు వండకూడదు, తినకూడదు. అయితే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు లేదా ముసలివాళ్లు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉంటే వారికి ఈ నియమం వర్తించదు.
– గ్రహణం మొదలవ్వకముందే దాదాపు అన్ని దేవాలయాలు మూసివేస్తారు. కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను మాత్రం వాటి వాటి స్థలమహాత్యం అనుగుణంగా తెరిచి ఉంచుతారు.
– ముఖ్యంగా గర్భిణులు గ్రహణ సమయంలో బయటకి వెళ్లకూడదు. పొరపాటున గ్రహణం చూస్తే పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడుతుంది.
– గర్భిణిలు గ్రహణానికి ముందే.. ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణ పట్టిన సమయంలో ఏ ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఆహారం తీసుకోవాలనుకుంటే తులసి ఆకులు ముందుగా అందులో వేయాలి. ఉడికించిన లేదా గోరు వెచ్చని నీటిని తాగాలి. పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు.
– గ్రహణ సమయంలో నిద్రించకూడదు..అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు.
– గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయాలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. గ్రహణం సమయంలో పిన్నులు, హెయిర్‌ పిన్నులు వంటి మెటల్‌ వస్తువులకు దూరంగా ఉండాలి.
– అలాగే గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేయాలి, ఆ తర్వాతనే ఆహారాన్ని వండుకుని తినాలి.
– ఇంట్లో నిల్వ ఉండే పదార్థాలపై దర్బలు(గరిక) వేసి ఉంచాలి.

Read Also:Uttar Pradesh : కబాబ్‎లు బాగో లేవని కుక్ ను కాల్చి చంపారు

ఇలాంటి నమ్మకాలకు సరైన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ గ్రహణం సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు. అయితే గ్రహణం సమయంలో మరి అంతా భయపడాల్సిన పనిలేదు. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి మనసును తేలికగా ఉంచుకోవాలి. సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడమో చేయాలి.