Tirumala Temple Closed for 12 Hours Today: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంను మూసేస్తారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు.
ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. సాయంత్రం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవ రద్దయింది. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేశారు. ఇవాళ సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకేన్లు టీటీడీ అధికారులు రద్దు చేశారు. సర్వదర్శనం భక్తులను నిన్న సాయంత్రం 4 గంటలకే క్యూ లైనులోకి అనుమతించడం నిలిపివేశారు. ప్రస్తుతం క్యూ లైనులో ఉన్న భక్తులకు ఇవాళ మధ్యాహ్నం 1 గంట లోపు దర్శనంకు అనుమతి ఉంటుంది.
Also Read: US Open 2025: యుఎస్ ఓపెన్ 2025 విజేతగా బెలారస్ భామ.. సెరెనా విలియమ్స్ తర్వాత..!
రేపు ఉదయం 6 గంటలకు సర్వదర్శనం భక్తులను క్యూలైన్లలోకి టీటీడీ అధికారులు అనుమతించనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టిక్కెట్లు కలిగిన భక్తులను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకే దర్శనానికి అనుమతించనున్నారు. ఈరోజు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆదివారం 30-35 వేల మందికి మాత్రమే దర్శనం లభిస్తుంది. భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ కోరింది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి.. దర్శనాలను పునఃప్రారంభిస్తారు.
