టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు..
మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రేపటి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. జీవి ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి చూస్తే.. సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. దుల్కర్ ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించగా రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి.. ఇక్కడ ఇతనికి మంచి మార్కెట్ ఏర్పడింది.. ఆయనతో సినిమా చెయ్యడానికి తెలుగు డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు..
ఇక దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఇటీవల తమిళ హీరో ధనుష్ తో ‘సార్’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు దుల్కర్ తో చేయబోయే సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.. మరి అతని నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.. దుల్కర్ రీసెంట్ గా ‘కింగ్ అఫ్ కోత’ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ మంచి టాక్ ను అందుకోలేక పోయాడు..