NTV Telugu Site icon

RR vs LSG: లక్నో ముందు భారీ స్కోరు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ

Rajasthan

Rajasthan

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

Read Also: Andhra Pradesh: వైసీపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

రాజస్థాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ (11) చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ (43), ధ్రువ్ జురేల్ (20), హెట్ మేయర్ (5) పరుగులు చేశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లక్నో ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. ఇక.. లక్నో సూపర్ జేయింట్స్ బౌలింగ్ లో నవీన్ ఉల్ హుక్ 2 వికెట్లు తీశాడు. మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో పెమ్మసాని మీట్ అండ్‌ గ్రీట్