NTV Telugu Site icon

LSG vs PBKS: లక్నో నడ్డి విరిచిన పంజాబ్ బౌలర్స్.. టార్గెట్ ఎంతంటే?

Lsg

Lsg

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన లక్నోకు పంజాబ్ బౌలర్స్ చెమటలు పట్టించారు. పంజాబ్ కింగ్స్ పేస‌ర్ల విజృంభ‌ణ‌తో ప‌వ‌ర్ ప్లేలోనే 3 కీల‌క వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో భారీ స్కోరుకు బ్రేకులు పడ్డాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.

Also Read:Zomato: ఉద్యోగం లోకి తీసుకున్న ఏడాదికే.. 600 మందిని తొలగించిన జొమాటో.!

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత మార్క్రమ్ 28 పరుగులు చేసి నాల్గవ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్ వెల్ పంత్ ను అవుట్ చేశాడు. పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత పురాన్ కొన్ని మంచి షాట్లు ఆడి 44 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ 16వ ఓవర్లో ఔటయ్యాడు. మిల్లర్ 19 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.