Site icon NTV Telugu

LSG vs CSK: రాణించిన పంత్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

Pant

Pant

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఖలీల్ అహ్మద్ మొదటి ఓవర్లోనే మార్క్రమ్‌ను అవుట్ చేశాడు. దీని తర్వాత, నికోలస్ పూరన్ కూడా నాల్గవ ఓవర్లో కాంబోజ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. పురాన్ బ్యాట్ నుండి కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

Also Read:LSG vs CSK: రాణించిన పంత్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

పంత్, మార్ష్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. కెప్టెన్ రిషబ్ పంత్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ జడేజా 10వ ఓవర్లో మార్ష్‌ను బౌల్డ్ చేశాడు. తర్వాత, 14వ ఓవర్లో దూకుడు మీద ఉన్న బదోనిని జడేజా అవుట్ చేశాడు. బదోని బ్యాట్ నుంచి కేవలం 22 పరుగులు మాత్రమే వచ్చాయి. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. చెన్నైకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతిషా పతిరానా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Exit mobile version