NTV Telugu Site icon

KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్

Kl Rahul Lsg

Kl Rahul Lsg

ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా టైటాన్స్‌పై లక్నో విజయం సాధించింది. అంతేకాదు ఇప్పటివరకు 160 ప్లస్ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లక్నో విజయం సాధించడం విశేషం.

గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుందన్నాడు. ‘లో స్కోరును కాపాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. యువ బౌలర్లతో మెరుగ్గా రాణిస్తున్నాం. ముగ్గురు స్పిన్నర్లు అదరగొట్టారు. యశ్‌ ఠాకూర్, కృనాల్ పాండ్యా వల్లే ఈ విజయం సాధించాం. సిద్ధార్థ్ కొత్త బంతితో బాగా బౌలింగ్ వేశాడు. రవి బిష్ణోయ్ క్యాచ్‌ అద్భుతం. మేం బ్యాటింగ్‌ చేసేటప్పుడే పిచ్ ఎలా ఉందో అర్ధమైంది. మా బౌలర్లూ పిచ్‌న బాగా ఉపయోగించుకున్నారు. 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయాలు సాధించడం బాగుంది. గత సీజన్‌లోనూ మేం ఇదే జట్టుతో ఆడాం. అప్పటికంటే మెరుగ్గా రాణిస్తున్నాం. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నెట్స్‌లో ఆటగాళ్లతో చర్చిస్తాం’ అని రాహుల్ చెప్పుకోచ్చాడు.

Also Read: Pushpa 2 The Rule: ‘సార్’ ఏంటిది అసలు.. టీజర్‌ గురించి చెప్పడానికి పదాలు లేవు!

ఈ మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్టాయినిస్‌ (58; 43 బంతుల్లో 4×4, 2×6), పూరన్‌ (32 నాటౌట్‌; 22 బంతుల్లో 3×6) చెలరేగారు. గుజరాత్‌ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (2/22), దర్శన్‌ నాల్కండే (2/22) రాణించారు. చేధనలో గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్‌ అయింది. సాయి సుదర్శన్‌ (31; 23 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. లక్నో పేసర్ యశ్‌ ఠాకూర్‌ (5/30) ఇది వికెట్స్ పడగొట్టాడు.

Show comments