ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లక్నో.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో ఇంతకుముందు మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవనే బరిలోకి దిగుతుంది. ఇక.. చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర స్థానంలో డారిల్ మిచెల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. గత మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది ఎనిమిదో మ్యాచ్. రెండు టీమ్ లు 7 మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలవగా.. మూడు మ్యాచ్ లలో ఓడిపోయారు. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా చెన్నై నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో నిలిచాయి.
చెన్నై ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీష పతిరన.
లక్నో ప్లేయింగ్ ఎలెవన్:
క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్ బ్యాటర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్,
యశ్ ఠాకూర్.
