NTV Telugu Site icon

MI vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..

Mi Vs Lsg

Mi Vs Lsg

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. మరోవైపు.. రెండు టీమ్ లు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు.. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగుతుంది. లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. క్వింటన్ డి కాక్ స్థానంలో అర్షిన్ కులకర్ణికి అవకాశం లభించింది. మరోవైపు.. మయాంక్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అతను గత కొన్ని మ్యాచ్‌లలో ఆడలేదు. ఇటు.. ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ల్యూక్ వుడ్ స్థానంలో గెరాల్డ్ కోయెట్జీని జట్టులోకి తీసుకున్నారు.

ముంబై ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

లక్నో ప్లేయింగ్ ఎలెవన్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

Show comments