IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు నూతన నాయకుడి అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. 2025, 2026 సీజన్లలో ఎల్ఎస్జీకి నాయకత్వం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్, జట్టు వరుస వైఫల్యాల కారణంగా విడిపోయి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వైపు మొగ్గు చూపాడు. దీంతో ఎల్ఎస్జీ తదుపరి కెప్టెన్ రేసులో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేరు బలంగా వినిపిస్తోంది. మార్క్రమ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఎల్ఎస్జీ సిస్టర్ ఫ్రాంచైజీ, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ విజయవంతంగా నడిపిస్తున్నాడు.
అయితే, ఎల్ఎస్జీ కప్టెన్సీపై తాను పెద్దగా ఆలోచించడం లేదని మార్క్రమ్ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంటుందని, లక్నో జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన నాయకులు ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినా జట్టును ఉత్తమంగా నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. మార్క్రమ్తో పాటు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా ఎల్ఎస్జీ నాయకత్వ రేసులో ఉన్నారు. లేదా రాబోయే మినీ వేలంలో కొత్త ఆటగాడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించే ఆలోచనలో కూడా యాజమాన్యం ఉండవచ్చని తెలుస్తోంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు.. 100 బంతుల ఫార్మాట్లో కెప్టెన్సీ చేయడం కొత్త సవాళ్లతో కూడుకున్నప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉందని మార్క్రమ్ వివరించాడు. జోస్ బట్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సలహాలు తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాడు. ఒకే వైపు నుంచి వరుసగా 10 బంతులు వేయించే నిబంధన ఈ ఫార్మాట్లో బౌలింగ్ వ్యూహాలను వేగంగా మార్చుకునేలా చేస్తుందని, లీగ్ పోటీ తత్వం తనను విశేషంగా ఆకట్టుకుందని అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..