LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..

Lpg Gas Subsidy Cut

Lpg Gas Subsidy Cut

వంటగ్యాస్ సబ్సిడీ పొందే కోట్లాది కుటుంబాలకు ప్రభుత్వం కీలక నిబంధనను అమల్లోకి తెచ్చింది. సబ్సిడీ ధరపై ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడం విధిగా మార్చారు. అర్హులైన పేద కుటుంబాలకే సబ్సిడీ అందేలా చూడటమే ఈ కొత్త నిబంధన ప్రధాన ఉద్దేశం. ఆధార్ ప్రామాణీకరణ చేసుకోని వినియోగదారులకు సిలిండర్ల సరఫరా ఆగదు కానీ, సబ్సిడీ మాత్రం నిలిచిపోతుంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటికే దాదాపు 90 శాతం మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లకుండానే, సిలిండర్ డెలివరీ సమయంలో లేదా ప్రముఖ చమురు కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా కూడా సులభంగా ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

సొంత ఇల్లు కొనుగోలు చేయడం జీవితంలో అత్యంత పెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఒకటి. అయితే ప్రతి నెలా ఈఎంఐ చెల్లించి ఇల్లు కొనడం కంటే, దీర్ఘకాలం పాటు అద్దెకు ఉండటమే మేలనే చర్చ తరచూ జరుగుతుంటుంది. ఇరవై నుంచి ముప్పై ఏళ్ల పాటు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ తక్కువగా అనిపించినప్పటికీ, వడ్డీ, డౌన్ పేమెంట్, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్‌లు, ఆ మొత్తాన్ని వేరే చోట పెట్టుబడి పెడితే వచ్చే రాబడిని అన్నీ బేరీజు వేసుకోవాలి. కేవలం అద్దె డబ్బులు వృథా అవుతున్నాయనే ఆలోచనతో మాత్రమే తొందరపడి ఇల్లు కొనడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ధర, ప్రాంతం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఆర్థిక పరిస్థితులను బట్టి ఏది లాభదాయకమో బేరీజు వేసుకోవాలి.

సహారా ఇండియా బాధితుల రిఫండ్ ప్రక్రియలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా బయటపడిన వివరాల ప్రకారం.. సహారా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉంది. తొలిసారి ఆర్టీఐ సమాధానంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య కోటీ అరవై ఏడు లక్షలకు పైగా ఉండగా, తర్వాతి సమాధానంలో అది కోటీ నలభై తొమ్మిది లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 18 లక్షల మందికి పైగా ఆ జాబితా నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అయితే, ఇప్పటివరకు దాదాపు 41 లక్షల మందికి పైగా అర్హులైన వారికి రూ.9,200 కోట్లకు పైగా డబ్బులు తిరిగి చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తులలో తప్పులు లేదా లోపాలు ఉన్నవారికి రిఫండ్ పోర్టల్ ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకునే (రీ-సబ్మిషన్) వెసులుబాటును కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహకార మంత్రిత్వ శాఖ ఈ రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.