NTV Telugu Site icon

Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..

Lovers

Lovers

ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడు చాటుమాటుగా నాలుగు గోడల మధ్య చేసే చిలిపి పనులు ఇప్పుడు నడిరోడ్డు మీదనే కానిస్తున్నారు.. చుట్టు ఎందరు చూస్తున్నా మాకేంటి అంటూ తెగ రెచ్చిపోతున్నారు.. కొందరు ఇలాంటి ఘటనల పై ఖండిస్తున్నా ఈ జంటల్లో మార్పులు రావడం లేదు.. పోలీసులు ఫైన్ వేసిన కడుతున్నారు తప్ప నలుగురు చూస్తున్నారు అనే సిగ్గు కొద్దిగా కూడా లేకుండా పోయింది.. ఇటీవల నడిరోడ్డుపై వేగంగా బైకు పై వెళుతున్న జంటలు పబ్లిక్ లో ముద్దులతో మునిగి పోతున్నారు.. తాజాగా మరో జంట రోడ్డుపై మూతి ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఓ జంట ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళుతుండగా అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది.. జైపూర్‌లోని దుర్గాపుర ప్రాంతంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. వీడియో వైరల్ అయిన వెంటనే, పోలీసులు యువకులను గుర్తించి పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు

ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వీరిని కాదు వీరి పేరెంట్స్ ను దారుణంగా శిక్షించాలి.. కొంచెం కూడా బుద్దిలేకుండా పిల్లలను కని వదిలేసారు.. అంటూ రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. గతంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.. కఠిన చర్యలు తీసుకుంటేనే లేకుంటే మార్పు రాదని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Show comments