Rajastan: ప్రేమికులు ఒకరికొకరు రహస్యంగా కలుసుకున్న కథలను చాలాసార్లు విని ఉంటారు. ఇది చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా, నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఎన్నో వినున్నాం.. చూసున్నాం. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు.
Read Also:KSRTC: అంతరాష్ట్ర ప్రయాణికులకు KSRTC బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే టికెట్ పైన 10 % తగ్గింపు..!
ఆ వ్యక్తి కూలర్‌లో దాక్కున్నాడు. వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో తెలియరాలేదు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని ఏ నగరానికి చెందినది అనేది కూడా సమాచారం లేదు. ప్రేమికుడు రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా.. కుటుంబసభ్యులు దొరికిచ్చుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దొంగ వచ్చాడని కుటుంబ సభ్యులు భావించారు. ఆ తర్వాత ఇంట్లో వెతకడం మొదలుపెట్టారు. వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వీధిలో కుక్కలు మొరగడం ప్రారంభించాయి, దాని కారణంగా అందరూ నిద్ర నుంచి మేల్కొన్నారు. అనంతరం వెతకగా.. ఆమె ఏదో దాస్తోందని అనుమానించారు. కూలర్ లోపల ఆమె ఏదో ఉందని అనుమానించారు. చూడగానే అందులో దాక్కుని కూర్చున్న ప్రేమికుడు కనిపించాడు.
Kalesh b/w a Guy and girl family over he came to meet her at night and her family caught him inside cooler in Rajasthan pic.twitter.com/bepkikh2Di
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 4, 2023
Read Also:Mahmood Ali: హోంమంత్రి మహమూద్ అలీ కారును చెక్ చేసిన పోలీసులు
వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆమెకు తను ప్రియుడని తెలుస్తోంది. @gharkekalesh అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేయబడింది. దీనిపై ప్రజలు చాలా కామెంట్లు చేస్తున్నారు. అమ్మడి టెక్నిక్ భలేగా ఉందని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరేమో కూలర్లు ఇలా దాచుకోవడానికి భలేగా పని వస్తున్నాయి అంటూ కామెంట్ చేశారు.
