Site icon NTV Telugu

Love Coupl: పురుగుల మందు తాగి.. ప్రేమ జంట ఆత్మహత్య..

Dead Body

Dead Body

ప్రేమ కోసం చంపడానికైనా.. లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు నేటి రోజుల్లో. కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులది హైదరాబాద్ లోని రామంతాపూర్ గా గుర్తించారు. ప్రేమ జంట ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version