Site icon NTV Telugu

Lot Mobiles: లాట్ మొబైల్స్‌11వ వార్షికోత్సవ ఆఫర్లు.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Vlcsnap 2023 08 11 17h57m51s692

Vlcsnap 2023 08 11 17h57m51s692

Lot Mobiles: ప్రముఖ మొబైల్ స్టోర్స్‌లలో ఒకటైన లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ ఎం. అఖిల్ ఆఫర్స్‌ను వెల్లడించారు. మొబైల్ రీటైల్ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చెయిన్ లాట్ మైబైల్స్ 11వ వార్షికోత్సవం జరుపుతోందని, 150కు పైచిలుకు స్టోర్స్‌తో ముందంజ వేస్తూ 11వ వార్షికోత్సవం సందర్భంగా అతి పెద్ద ఆఫర్లతో తమ కస్టమర్లకు మరింత చేరువగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా రూ.3999/- విలువగల ఎయిర్ పాడ్స్ లేదా రూ.3999/- విలువగల వైర్లెస్ బ్లూటూత్ హెడ్‌సెట్ కేవలం రూ. 11/- కే అందిస్తున్నామన్నారు. తమ వద్ద కొనుగోలు చేసిన ప్రతి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఎయిర్ కండిషనర్స్, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ కొనుగోలుపై రూ. 2500/- వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఖచ్చితమైన బహుమతి ఇవ్వబడుతుందని డైరెక్టర్‌ ప్రకటించారు. స్మార్ట్ టీవీల అందుబాటు ధర రూ. 8499 నుంచి ఆరంభమై రూ.15,000/- వరకు డిసౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను కూడా లాట్ మొబైల్స్ తమ కస్టమర్లకు కల్పిస్తోందన్నారు. అదేవిధంగా బ్రాండెడ్ ల్యాప్టాప్స్ ధర రూ.16500/- మంచి ఆరంభమై 7.5శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సదుపాయం కలిపిస్తున్నామన్నారు.

Also Read: Direct Tax Collection: ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తున్న ప్రత్యక్ష పన్నులు.. ఆగస్ట్ 10నాటికి రూ.6.53లక్షల కోట్లు

శాంసంగ్ కొత్తగా లాంచ్ చేయబడిన Fold5 / Flip5 మొబైల్స్ కొనుగోలుపై రూ. 30,000/- వరకు ప్రయోజనాలు. యాపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్స్ కొనుగోలుపై రూ.7,000/- వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ లభిస్తుందన్నారు. వివో, ఒప్పో మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000/- వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందన్నారు. వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ మొబైల్స్ కొనుగోలుపై రూ.5,000/- వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది. పేటీమ్‌, మొబిక్విక్ వాలెట్‌పై 5శాత ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ గాడ్జెట్స్ పై 80శాతం వరకు తగ్గింపు లభించనుంది. కార్డుపై రూ.1/- డౌన్‌ పేమెంట్‌తో మొబైల్, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే సదుపాయం కలదు.

విస్తృత శ్రేణికి చెందిన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్, మొబైల్ యాక్ససరీస్, స్క్రీన్ గార్డ్స్ కలెక్షన్, సౌండ్ వూఫర్స్, సౌండ్ బార్స్, ఇన్వర్టర్స్, ప్రింటర్స్, నెక్ బ్యాండ్స్, ఎయిర్ పాడ్స్. హెడ్ సెట్స్‌పై ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం. సుప్రజ మాట్లాడుతూ.. ప్రజానీకమంతా ఈ వార్షికోత్సవ ఆఫర్లను వినియోగించుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Exit mobile version