NTV Telugu Site icon

Viral Video: పంక్చర్ వేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ప్రమాదమే

Pun

Pun

Viral Video: సోషల్ మీడియా వచ్చాక ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూడని వింతలు, విశేషాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా కూడా జరుగుతుందా అనే చాలా సంఘటనలను మనం ఎన్నో సోషల్ మీడియాలో ప్రస్తుతం చూస్తున్నాం. వాటిలో కొన్ని ఫన్నీ గా ఉంటే కొన్ని మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం అక్కడ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అనే విధంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: Viral Video: బాధ్యతకు మారు పేరు అమ్మ.. ఈ వీడియోనే సాక్ష్యం

వైరల్ అవుతున్న వీడియో ఓ పంక్చర్ షాపుకు సంబంధించినది. ఓ పంక్చర్ షాపులో ఇద్దరు వ్యక్తులు లారీ టైర్ కు పంక్చర్ వేస్తూ ఉంటారు. అయితే దానిలో గాలి కొడుతూ ఉండగా పీడనం ఎక్కువ అయ్యి అది ఒక్కసారిగా గాలిలోకి లేస్తుంది. దీంతో దానికి పంక్చర్ వేస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా పైకి గాల్లోకి లేచి కిందపడతారు. వీడియో చూస్తుంటే ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి చేతికి దెబ్బతగిలినట్లు అర్థం అవుతుంది.అక్కడ పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా టైర్ అలా లేచి కింద పడటంతో భయపడిపోతారు. ఒకతను ఐతే అక్కడి నుంచి వెంటనే తన బైక్ తీసుకొని పక్కకు వెళ్లిపోతాడు. నిజం చెప్పాలంటే భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టే వారు బతికిపోయారు. లేదంటే ఆ టైర్ ఎగిరి మీద పడిందంటే ప్రాణాలు పోవాల్సిందే. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని మిలియన్ల మంది చూశారు. లక్షల మంది లైక్ చేశారు. దీనిని చూసిన వారు వీరు చాలా లక్కీ అందుకే బతికిపోయారు అని కామెంట్ చేస్తుంటే పంక్చర్ వేసేటప్పుడు ఇలా కూడా జరగొచ్చు జాగ్రత్త అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కసారిగా గుండె ఝల్లమనిపిస్తోంది. అయితే చాలా మంది దీనిపై ఫన్నీగా కూడా స్పందిస్తున్నారు.

 

Show comments