అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదఘటన పై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Annamayya: ఘోర ప్రమాదం.. టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
- టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ
- ముగ్గురు మృతి

Road Accident