Site icon NTV Telugu

Lorry Driver: హైవే పై లారీ తోలుతూ డేంజర్ స్టంట్ చేసిన డ్రైవర్.. వీడియో వైరల్..

Lorry

Lorry

సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కోసం, కొంతమంది చేసే సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తారు. ఇలాంటి వింత విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ చేసిన స్టంట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: PM Modi: చర్మం రంగును బట్టి విలువ ఇస్తారా..! అందుకే ముర్మును వ్యతిరేకించారా..?

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రక్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. లారీ వేగం స్పీడ్ గా వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ స్టీరింగ్‌ నుంచి దూరంగా వెళ్లి సీటుపై నుంచి లేచాడు. అతను లారీ తలుపు తెరిచి, బయటికి వచ్చి, ట్రక్కు ఇంజిన్ అద్దాల దగ్గరకు నడిచాడు. అలా తిరుగుతూ క్లీనింగ్ వైపు ఉన్న డోర్ ద్వారా ట్రక్కులోకి ప్రవేశిస్తాడు. చివరగా అతను తన సీటుకు తిరిగి వచ్చి స్టీరింగ్‌ని నియంత్రిస్తాడు.

Also Read: Fake Aadhaar Cards: కేర‌ళ‌లో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు.. కేంద్రాల్లో సృష్టిస్తున్న‌ట్లు వెల్లడి

అయితే ఆ క్రమంలో లారీని అటు ఇటు నడిపినా పెను ప్రమాదం జరిగి ఉండేది. ముందు, వెనుక వాహనాలు కూడా ప్రమాదానికి గురవుతాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఈ డ్రైవర్ వైఖరి అసాధారణంగా ఉంది., ఇలాంటి వారిని ఊరికే వదలకుండా కఠినంగా శిక్షించాలి ” అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version