Site icon NTV Telugu

Lorry Bandh: ఏపీలో రేపు లారీల బంద్‌.. విషయం ఇదే..

Lorry Bandh

Lorry Bandh

Lorry Bandh: ఆంధ్రప్రదేశ్‌లో రేపు లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.. అదేంటి? లారీలు ఎందుకు ఆగిపోతాయి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది.. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఇలా అన్ని రంగాల నుంచి వారికి మద్దతు లభిస్తూనే ఉంది.. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా ముందుకు కదిలింది.. బుధవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్‌ నిర్వహించినున్నట్టు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు వెల్లడించారు.

Read Also: Astrology : మే 02, మంగళవారం దినఫలాలు

విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు.. రేపు ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలిపివేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రవాణా రంగానికి విశాఖ ఉక్కు కర్మాగారం వెన్నుముకగా ఉంది.. నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి కారణంగా రోజుకు 2 వేల లారీల ఎగుమతి, దిగుమతుల సామర్థ్యంతో లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు.. అలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులందరూ ఈ బంద్‌లు భాగస్వాములు కావాలని కోరారు.. లారీలను ఆపివేయాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఈ తరుణంలో.. విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

Exit mobile version