Parents Killed By Son USA: అమెరికాలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఒక కొడుకు తన సొంత తల్లిదండ్రులను చంపినట్లు టీవీ షోలో వెల్లడించాడు. అమెరికాలో నిర్వహించిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం తన తల్లిదండ్రులను హత్య చేసి, వారి మృతదేహాలను తన ఇంటి వెనుక భాగంలో ఎలా పాతిపెట్టాడో వెల్లడించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితుడు స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
READ ALSO: Sangareddy : మంజీరా నదిలో భారీ వరద ప్రవాహం
రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..
అల్బానీలోని నిందితుడి ఇంటి నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గురువారం నిందితుడు లోరెంజ్ క్రాస్ తన తల్లిదండ్రులను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. క్రాస్ తల్లిదండ్రులు ఫ్రాంజ్- థెరిసియా క్రాస్‌లను చాలా ఏళ్లుగా కనిపించలేదని పోలీసు దర్యాప్తులో తేలింది. అమెరికాలోని ఒక స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోరెంజ్ క్రాస్ ఈ హత్యలు తాను చేశానని వివరించాడు. తన తల్లిదండ్రులను తాను చంపానని నేరుగా అంగీకరించడానికి క్రాస్ మొదట్లో సంకోచించాడు, కానీ యాంకర్ అతనిని అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత, అతను నిజం ఒప్పుకున్నాడు.
నేను నా విధిని నిర్వర్తించాను – క్రాస్..
“తల్లిదండ్రులు నన్ను చంపమని అడగలేదు, కానీ వారి పరిస్థితి క్షీణిస్తోందని వారికి తెలుసు” అని క్రాస్ అన్నారు. “నేను నా తల్లిదండ్రుల పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. వారి బాధల పట్ల నాకున్న ఆందోళన అన్నిటికంటే గొప్పది” అని ఆయన చెప్పినట్లు సమాచారం. తన తల్లి రోడ్డు దాటుతుండగా పడి గాయపడిందని, కంటి శస్త్రచికిత్స తర్వాత తన తండ్రి ఇకపై కారు నడపలేడని క్రాస్ చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులకు ఎటువంటి ప్రాణాంతక అనారోగ్యాలు లేవని క్రాస్ ఈ ఇంటర్య్వూలో ప్రస్తావించలేదు. క్రాస్ ఇంటర్వ్యూ తర్వాత ఛానల్ నుంచి నిందితుడి ఫోన్ నంబర్‌తో కూడిన ఇమెయిల్ వచ్చింది. యాంకర్ క్రాస్‌కు కాల్ చేసినప్పుడు, అతను తన తల్లిదండ్రులను తన ఇంటి వెనుక ప్రాంగణంలో ఎలా పాతిపెట్టాడో వివరించాడు. నిందితుడు స్టూడియో నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
READ ALSO: Argentina Alive After Death: ట్విస్ట్ మామూలుగా లేదు భయ్యా.. చనిపోయిన వ్యక్తి బతికి వచ్చాడు!
