Site icon NTV Telugu

Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో

Lord Ganesh

Lord Ganesh

Lord Ganesh: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాఠశాలలో చదువుతున్న 4,000 మంది విద్యార్థులు గణేశుడి భారీ ఆకృతిని ప్రదర్శించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించడం ద్వారా అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ డ్రోన్ కెమెరా ద్వారా పై నుండి చిత్రీకరించగా.. వెలుగుల కాంతిలో గణేశుడి ఆకృతి మరింత అందంగా కనిపించింది.

Helicopter Crash: షాకింగ్ సీన్.. నీరు నింపే ప్రయత్నంలో బొక్క బోర్ల పడ్డ హెలికాప్టర్.. వైరల్ వీడియో

ఈ విషయమై పాఠశాల విద్యాసంస్థ అధ్యక్షుడు నెక్కంటి సూరిబాబు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు గణేశుడి ఆకృతిని దీపాలతో అలంకరించి దేవుడికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న ప్రాథమిక, హైస్కూల్ స్థాయి విద్యార్థుల సహకారంతో పర్యావరణహిత గణేశ విగ్రహాలను తయారు చేశారని ఆయన తెలిపారు.

Shocking Incident: లవర్ను లాడ్జికి తీసుకెళ్లి.. జిలెటిన్ బాంబు పేల్చి చంపేసిన మృగాడు!

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, వారి సృజనాత్మకతను వెలికి తీయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఆలోచనాత్మక కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల సమష్టి కృషితో రూపొందిన ఈ వినూత్న వేడుక అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ అద్భుతాన్ని ఈ వీడియోలో వీక్షంచండి.

Exit mobile version