MS Dhoni Cast His Vote in Ranchi Today: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని పోలింగ్ స్టేషన్‌లో ధోనీ ఓటేశారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వచ్చిన మహీని చూసేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అయితే అక్కడున్న కొందరు ఆయనను పోలింగ్ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఓటేసిన అనంతరం మహీ కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
Also Read: Karthi New Movie: ’96’ డైరెక్టర్‌తో కార్తీ.. సినిమా పేరు, ఫస్ట్ లుక్ వైరల్!
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరని విషయం తెలిసిందే. చెన్నై లీగ్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఆదివారం (మే 19) నాడు ఎంఎస్ ధోనీ బెంగళూరు నుండి రాంచీ బయలుదేరాడు. 42 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2024లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించారు. ఐపీఎల్ 2024లో 73 బంతుల్లో 220.55 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశారు. గాయంతో బాధపడుతున్న ధోనీ.. వచ్చే సీజన్ ఆడతాడో లేదో చూడాలి. మహీ ఐపీఎల్ 2025లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.